Breaking News

దక్షిణ మధ్య రైల్వే శాఖ కబడ్డీ కోచ్ కె. అయ్యప్ప రెడ్డిని,వీర శౌర్య అవార్డుతో సత్కరించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలు


   జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలలో కె. అయ్యప్ప రెడ్డిని సంస్థల చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా పురాణ ఇతిహాసాలలో శస్త్ర యుద్ధ విద్యలో ఆరితేరి గురువులకే గురువు గా పేరొందిన మహర్షి పరశురాం పేరు మీదుగా
వీర శౌర్య పరశురాం అవార్డును బహూకరించారు.
ఈ సందర్భంగా గాంధీ సంస్థల రాష్ట్ర క్రీడల కార్యదర్శి  బొమ్మ పాల గిరిబాబు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా అనుముల మండలం నాయుడుపాలెం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన k.అయ్యప్ప రెడ్డి ఎంతో పట్టుదల. క్రమశిక్షణ... అకుంఠిత దీక్ష మరియు గురువుల యందు భక్తి భావనతో. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థానానికి రావడం... మన నల్లగొండ జిల్లా కే గర్వకారణమని తెలిపారు.

2020 మార్చి నెలలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రథసారధి మరియు  రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయిన.  జగదీష్ యాదవ్ గారి సారధ్యంలో నిర్వహించిన తెలంగాణ ప్రో కబడ్డీ పోటీలలో 
సినీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి  ఆధ్వర్యంలోని నల్గొండ ఈగల్ కబడ్డీ జట్టు కోచ్గా సమన్వయంతో ముందుకు నడిచి జట్టు విజేతగా నిలవడం విశేషం.ఎంతో మంది అంతర్జాతీయ ప్రోకబడ్డీ క్రీడాకారులు ఈయన శిష్యులు కావడం మన నల్లగొండ జిల్లా కే గర్వకారణం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల రాష్ట్ర ప్రతినిధులు రేపాక ప్రదీప్ రెడ్డి, జి జి ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెరుగు మధు. ప్రచార కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, ఎండి కలీముద్దీన్. ఎండి ఇస్మాయిల్, గుండాల గోవర్ధన్.. భూలక్ష్మి.. తదితరులు పాల్గొన్నారు.