Breaking News

తక్కువ ‌ ధరలో హానర్‌ స్మార్ట్‌ఫోన్లు



చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హానర్‌ అందుబాటు ధరల్లో రెండు స్మార్ట్‌ఫోన్లను భారతమార్కెట్లో లాంచ్‌ చేసింది. 9ఎస్‌, 9ఏ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఆగస్టు 6వ తేదీనుంచి తగ్గింపు ధరలో ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. హానర్ 9 ఎస్ ఫీచర్లు 5.45-అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఐడీఎస్‌ ఆండ్రాయిడ్ 10 , మ్యాజిక్ యుఐ 3.1 మీడియాటెక్ ఎంటీ 6762 సాక్‌ 1440 x 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 2 జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3020 ఎంఏహెచ్ బ్యాటరీ 6,499 రూపాయలకు తీసుకొచ్చింది. లాంచింగ్‌ ఆఫర్‌గా 500 తగ్గింపుతో 5999 రూపాయలకు లభ్యం. హానర్ 9 ఏ ఫీచర్లు 6.3 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌డిప్‌స్లే మీడియా టెక్ ఎంటీ 676ఆర్‌ ప్రాసెసర్ ఆండ్రాయిడ్‌ 10 1600 x 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 13+5 + 2 ఎంపీ రియర్‌కెమెరా 3జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రూ. 11,999 వద్ద లాంచ్‌ చేసింది. అయితే ప్రారంభ ఆఫర్‌గా 8,999 కే అందుబాటులో ఉండనుంది.