Breaking News

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ముట్టడి


ఆటో,క్యాబ్‌డ్రైవర్ల యూనియన్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. పెద్దఎత్తున నిరసన తెలుపుతూ యూనియన్‌ నాయకులు ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. 2019 మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికులకు రూ. 7,500 ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలిపారు. కార్మిక చట్టాలను సవరించాలని కోరారు. ప్రైవేటు అప్పులను 6నెలలు వాయిదా వేయాలన్నారు.