Breaking News

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ప్రకటన


స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ప్రకటన వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ తన 21వ చిత్రం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. ‘నా తదుపరి చిత్రం కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. కొంతకాలంగా నేను దీని కోసమే ఎదురుచూస్తున్నాను. సుధాకర్‌ గారి మొదటి ప్రాజెక్టుకు నా శుభాకంక్షలు. శాండి, స్వాతి, నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను చూపించే మార్గం. కాగా, ఈ చిత్రంతో సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శాండీ, స్వాతి, నట్టీలు సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.