Breaking News

జి జి ఎఫ్ ప్రకృతి ఆశ్రమం కరపత్రం ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి



 వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం లో నిర్వహిస్తున్న ప్రకృతి వైద్య ఆశ్రమ కరపత్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో గాంధీ సంస్థలు అందిస్తున్న ఉచిత ప్రకృతి వైద్య సేవలు ఎంతో అభినందనీయం అన్నారు. ప్రస్తుత సమయంలో ప్రకృతి ఆధారిత జీవన విధానం ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. దీని ద్వారా మనము రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చా అన్నారు.  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సుస్థిర వైద్యము సుస్థిర ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నఅందుకు గాంధీ సంస్థల ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేందర్ ర్ రెడ్డి మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి గాంధీ సంస్థలు నిరంతరం కృషి చేస్తాయన్నారు. ప్రకృతి వైద్యం తో సహజ ఈ విధానాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతులను ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర రావు, పద్మ దంపతుల సహకారంతో అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల సలహాదారులు ఎన్ వి గోనారెడ్డి,
ఎస్. డి. సుబ్బారెడ్డి, రేపాక ప్రదీప్ రెడ్డి,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి తలకోన పురుషోత్తం రెడ్డి, యానాల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ మెరుగు మధు, డాక్టర్ కోడి శ్రీనివాసులు, మటన్ మల్లికార్జున్, పాముల అశోక్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు