Breaking News

జి జి ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వినోబాభావే 125వ జయంతి ఉత్సవాలు


గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం వినోబాభావే గ్రామంలో ఘనంగా వినోబాభావే 125వ జయంతి వేడుకలు జరిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గుణ రాజేందర్ రెడ్డి వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూ ఎంతోమంది అభాగ్యులకు భూములను సేకరించి పేద ప్రజల ఆకలిదప్పులు తీర్చిన మహోన్నత వ్యక్తి వినోబాభావే అని గుర్తు చేశారు.వినోబాభావే తెలంగాణ గడ్డపై పాదం మోపి మొట్టమొదట శివరాంపల్లి ప్రకృతి ఆశ్రమం నుండి చేనేతలు పోచంపల్లి వరకు పాదయాత్ర చేసి పోచంపల్లి గ్రామం లో పేద ప్రజల సమక్షంలోనే మీలో భూమి దానం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని వినోబాభావే అనగానే వెదిరే రామచంద్రారెడ్డి  చెయ్యెత్తి నేనున్నానని తనకు ఉన్న భూమిలో కొంత భూమిని భారీ విరాళంగా ఇచ్చిన మొదటి వ్యక్తి పోచంపల్లి వాసి అని గుర్తు చేశారు. అప్పటి నుండి పోచంపల్లి పేరు భూదాన్ పోచంపల్లి గా పేరు మారి తదనంతరం ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ గా మారిందని అన్నారు. ఆనాడు వినోబాభావే ఇచ్చిన నినాదం జై జగత్ అనే నినాదంతో భారతదేశం మొత్తం మారుమోగిపోయింది అన్నారు.వినోబాభావే జీవిత విశేషాలను నేటి తరం విద్యార్థులకు యువతకు అందుబాటులోకి తేవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లో గాని ఈ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, జి జి ఎఫ్ సుస్థిర వ్యవసాయ పాడిపంటలు రాష్ట్ర అధ్యక్షులు నక్క శ్రీనివాస్ యాదవ్, ప్రచార కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, గాంధీ సంస్థల రంగారెడ్డి జిల్లా ప్రతినిధులు బి వి గౌడ్, గోపాల్ రెడ్డి, డి. దశరథ గౌడ్, రామాంజనేయులు, సుభాష్ చంద్ర , అశోక్ గంగపుత్ర, వీరేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు