Breaking News

2023కల్లా గాల్లో ఎగిరే కార్లు ...


SATYASHILA TV :
ట్రాఫిక్‌ జామ్‌లు, గతుకుల రోడ్ల గొడవలు లేకుండా ఎంచక్కా గాలిలో ఎగిరిపోయే కారొస్తే ఎంత బాగుంటుంది! ప్రపంచవ్యాప్తంగా ఎగిరే కార్లను తయారు చేసే ప్రాజెక్టులు 100పైగా కొనసాగుతున్నాయి. అందులో ఒకటే ఈ ఫోటోలో కనిపించే కారు. జపాన్‌కు చెందిన స్కై డ్రైవ్‌ సంస్థ శుక్రవారం ఎగురుతున్న తమ కారుకు సంబంధించి వీడియోను విడుదల చేసింది. చుట్టూ అన్ని వైపులా.. పైన కూడా నెట్‌ కట్టి... అందులో టెస్ట్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఒక మనిషి కూర్చొని ఉన్న ఈ కారు ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తులో నాలుగు నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టింది. 2023కల్లా పూర్తిస్థాయి ఎగిరే కారును అందుబాటులోకి తేగలమని స్కై డ్రైవ్‌ ఆశాభావం వ్యక్తం