Breaking News

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్‌లాక్-4 అ,అమలు


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్‌లాక్-4 ప్రారంభమైన నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం మరిన్ని రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. అధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో అదనంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని యోచిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో వంద రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. హోంశాఖకు రైల్వే శాఖ ప్రతిపాదనలను పంపించింది. హోంశాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల్లో రైల్వేశాఖ ప్రకటన చేయనుంది. ఇప్పటికే అన్‌లాక్-4 ప్రక్రియలో భాగంగా ఈనెల నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ గ్నీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.