Breaking News

ఏపీలో కరోనా కల్లోలం: 6 లక్షలు దాటిన కేసులు


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అత్యధిక కేసులున్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షలను దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తాగత 24 గంటల్లో ఏపీలో 77,492 నమూనాలను పరీక్షించగా.. 8702 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కు చేరింది. తాజాగా, 10,72 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,08,088కి చేరింది. ప్రస్తుతం 88,197 యాక్టివ్ కేసులున్నాయి. అయితే, కొత్తగా నమోదువుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా మారింది.జా బులిటెన్ విడుదల చేశారు.ఒక్క రోజు వ్యవధిలో 72 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5177కు చేరింది. జిల్లాల వారీగా మరణాలు గమనించినట్లయితే.. చిత్తూరులో అత్యధికంగా 12 మంది మరణించారు. ప్రకాశంలో 10, కపడలో 6, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు చొప్పున, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మరణించారు.