Breaking News

ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ క్రీడాకారులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డు లతో ఘనంగా సన్మానించిన గాంధీ గ్లోబల్ సంస్థలు.


జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలలో భాగంగా గాంధీ కుటీర్ లో జరిగిన కార్యక్రమంలో.. అంతర్జాతీయ ప్రో కబడ్డీ తెలుగు టైటాన్ క్రీడాకారులు అయినా సిద్ధార్థ్ దేశాయ్, మల్లికార్జున లను సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి , జి జి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తూ భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో యువకులలో స్పూర్తిని నింపుతూ. జాతీయోద్యమంలో పాల్గొనేటట్లు చేసి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా అవార్డులను అంతర్జాతీయ క్రీడా కారులకు ప్రధానం చేయడం గర్వంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా గాంధీ సంస్థల రాష్ట్ర క్రీడా కార్యదర్శి  బొమ్మపాల గిరిబాబు గారు మాట్లాడుతూ

రాబోయే రోజుల్లో గాంధీ సంస్థలు రాష్ట్ర స్థాయిలో క్రీడా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించడమే కాకుండా జాతీయ స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా.
 క్రీడా సేవ చేస్తూ. క్రీడా కారుల అభివృద్ధే లక్ష్యంగా.  క్రీడా రంగానికి అత్యున్నత సేవలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి నాణ్యమైన క్రీడాకారులను అందిస్తున్న కోచ్ లను గుర్తించి వారికి అత్యున్నత పురస్కారాలు ఘన సన్మానాలను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థలు నిర్వహించనున్నాయి అని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో  గాంధీ సంస్థల సలహాదారులు రేపాక ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, రాష్ట్ర పబ్లిసిటీ సెక్రెటరీ పాముల అశోక్ ముదిరాజ్, ట్రస్మా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడి శ్రీనివాస్, జి జి ఎఫ్ రంగారెడ్డి జిల్లా సుస్థిర క్రీడా కన్వీనర్ కుడుముల భాస్కర్ రెడ్డి, జి జి ఎఫ్ రాష్ట్ర గ్రామ నిర్మాతల కన్వీనర్ గుండాల గోవర్ధన్ లు పాల్గొన్నారు