Breaking News

డిల్లిలోని అన్ని కారిడార్లలో మైట్రో రైళ్ల రాకపోకలు ...భయందోలనలో ప్రజలు


SATYASHILA TV : ఢిల్లీ మెట్రో సేవలు శనివారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. అన్ని కారిడార్లలో మైట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభమైయ్యాయి. ప్రయాణ సమయాలు కూడా కరోనా పూర్వపు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇకపై ఉదయం 6 నుంచి రాత్రి 11.00 గంటల వరకూ మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు సామాజిక దూరం నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేలా ఢిల్లీ మెట్రో కార్పొరేషన్(డీఎమ్ఆర్‌సీ) అనేక చర్యలు చేపట్టింది. డీఎమ్ఆర్‌సీ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ అధికారుల ఫ్లయింగ్ స్కాడ్‌లు రైళ్లలో ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా ఉండేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయి. కేంద్రం ప్రకటించిన అన్‌లాన్-4లో భాగంగా ఈ వారం మొదట్లో ఢిల్లీ మెట్రో సేవలు పరిమిత స్థాయిలో మాత్రమే ప్రారంభమయ్యాయి. ఆ తరువాత డీఎమ్ఆర్‌సీ క్రమక్రమంగా మెట్రో కార్యకలాపాలను విస్తరిస్తూ.. ఈ రోజు పూర్తిస్థాయి సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. మార్చి 22న మూతబడ్డ తరువాత ఢిల్లీలో పూర్తి స్థాయి మెట్రో సేవలు ప్రారంభమవుడం ఇదే తొలిసారి.