Breaking News

ముంబైలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్, డబ్బులు


మహారాష్ట్రలోని ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ యూనిట్ ఆదివారం ఆకస్మిక దాడులు చేసింది. ఈ సందర్భంగా హషీష్, ఎల్‌ఎస్‌డి, గంజా వంటి మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. 1,85,200 భారత కరెన్సీ, 5,000 ఇండోనేషియా కరెన్సీని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనుజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈ డ్రగ్స్‌పై ప్రశ్నిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. బాలీవుడ్‌తోపాటు శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. సుశాంత్ సింగ్ మరణం నేపథ్యంలో సినీ పరిశ్రమతోపాటు ఇతర వ్యక్తులకు సంబంధించిన డ్రగ్స్ వ్యహారాలపై ఎన్సీబీ, ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడుతున్నాయి.