Breaking News

బెండకాయ తో అద్భుతమైన వంటకం


బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా... అని సామెత బ్రహ్మచారి సంగతేమో కానీ... బెండకాయను మాత్రం లేతగా ఉండగానే వండాలి దీనిలో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషకాలతోపాటు అయోడిన్‌ కూడా ఉండటం వల్ల అనేక వ్యాధులను దరిచేరనివ్వదు అన్నట్లు ఓపిక ఉండి వండాలేకానీ బెండతో రకరకాల వెరయిటీలు చెయ్యొచ్చు రుచి చూశారంటే బెండర్‌ఫుల్‌ అనాల్సిందే!

బెండకాయ 65

కావలసినవి: అల్లం – చిన్న ముక్క; పచ్చిమిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 4; బెండకాయలు – అర కిలో; సెనగ పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పల్లీలు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి కొబ్బరి – పావు కప్పు.