Breaking News

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకున్నట్లు వెల్లడి


SATYASHILA TV : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. తాజాగా బాలుకు కరోనా నెగిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రపంచ సంగీత ప్రియులు చేసిన ప్రార్థనలు ఫలిస్తున్నాయి. మతం, ప్రాంతం అనే తేడా లేకుండా జనమంతా బాలు ఆరోగ్యం బాగుపడాలని అంతా కోరుకున్నారు. మా బాలు ఆరోగ్యం కుదుట పడాలని, తిరిగొచ్చి ఇంపైన పాటలు పాడాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. బాలు గొంతు సవరించుకోవడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఎస్పీబీ కుమారుడు ఎస్పీబీ చరణ్ వీడియోలో చెప్పినవిధంగా అయితే వచ్చే సోమవారం నాటికి బాలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. బాలు కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన కోలుకోవాలని సెలబ్రెటీలు , సంగీత ప్రేమికులు దేవుడిని ప్రార్దిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆయన తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే వున్నాడు. బాలు ఊపిరితిత్తులు కూడా మెరుగుపడ్డాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని తెలియగానే అభిమానులు సంతృప్తి వ్యక్తం చేశారు.వచ్చే సోమవారం నాటికి నాన్న ఆరోగ్య విషయంలో శుభవార్త వెలువడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు.. అని వీడియోలో చెప్పారు చరణ్‌. నాన్న తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. గత కొన్నిరోజులుగా చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా ఆయన శరీరం సహకరిస్తున్నట్లు సమాచారం. ఇక బాలుకు నెగిటివ్ రావడంతో సంగీత ప్రేమికులు , ఆయనను అభిమానించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కావాలని ప్రార్ధనలు చేస్తున్నారు.