Breaking News

ఆరోగ్య సమస్యలకు ప్రకృతి వైద్యం పరిష్కారం : డాక్టర్ కె వై రామచందర్ రావు
SATYASHILA TV:
వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న భారతీయ జీవన విధానంలో ప్రకృతి వైద్యం అంతర్భాగంగా ఉందని డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అన్నారు.ఆదివారం వినోభా భావే గ్రామంలో కరోనా పరిణామాలు ప్రకృతి వైద్యం పాత్ర సదస్సులో  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఉమ్మడి రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో వైద్యం ఇమిడి ఉందని గుర్తు చేశారు. ప్రాణ శక్తిని పెంచే అద్భుతమైన ఆహార పద్ధతులు భారతీయ ప్రజలకు సుపరిచితమే అన్నారు. నిత్య జీవితంలో ఆధునిక పోకడలను మాని సాంప్రదాయబద్ధంగా జీవన విధానానికి అలవాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ సందర్భంగా గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గుండా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో సుస్థిర అభివృద్ధి కమిటీలు నిర్మాణం పూర్తి అయిందని అన్నారు. ఆ కమిటీ ల లో బాధ్యతలు తీసుకున్న జిల్లా రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ప్రతినిధులను ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో అభినందనీయం అన్నారు. గాంధీ సంస్థలు చేస్తున్న సుస్థిర వైద్య, సుస్థిర విద్య ,సుస్థిర ప్రకృతి వనరు ఇంధనం, మరియు సుస్థిర క్రీడలను గ్రామస్థాయి వరకు తీసుకోవడానికి కమిటీలు కృషిచేయాలని అన్నారు.ఈసందర్భంగా జిల్లా బాధ్యులు గా ప్రమాణ స్వీకారం పొందిన అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ లక్ష్యాలైన సత్యం అహింస సత్యాగ్రహాలు పాటిస్తూ సమాజంలోని ప్రస్తుత ఉన్న పరిస్థితులను మార్చాల్సిన  బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉందని అన్నారు. సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యావేత్తలు సామాజిక వ్యక్తులను కమిటీలలో కి ఆహ్వానిస్తున్నామని గాంధీ సంస్థలతో కలిసి పని చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరిని మేము స్వాగతం పలుకుతామని అన్నారు. కార్యక్రమంలో గాంధీ సంస్థల సలహాదారులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, సుస్థిర క్రీడల రాష్ట్ర కార్యదర్శి బొమ్మ పాలగిరి బాబు, మల్లికార్జున రెడ్డి, జి జి ఎఫ్ సుస్థిర వ్యవసాయ రాష్ట్ర అధ్యక్షులు నక్క శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ ఎన్ జీ. పద్మ, మాజీ ఐఏఎస్ అధికారి నిర్మల దేవి, నాగమణి ,పావని రెడ్డి, గుండాల గోవర్ధన్, పాముల అశోక్ ముదిరాజ్, గౌడ్, బి వి టి గౌడ్, భాస్కర్ రెడ్డి, మైనేని వాణి, మెరుగు సునీత, దిగంబర్, సుభాష్ చంద్రబోస్, చిలుకల శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు