Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విద్యా విధానం చట్టం అమలు : సీఎం జగన్


SATYASHILA TV  :రాష్ట్రంలో నూతన విద్యా విధానం చట్టం అమలు, ప్రయోజనాలపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురాగా.. దానిపై సీఎం జగన్ మంగళవారం సమీక్షించారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారని మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు తెలిపారు. నూతన విద్యా విధానంలో ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా అంశాలు ఉన్నాయని తెలిపారు. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నామని.. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్ వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఒక ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించామని మంత్రి వివరించారు.