Breaking News

జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతించింన పవన్ జనసేన


SATYASHILA TV, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లు కాలిపోయిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించే దిశగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. అంతర్వేది ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొంది. శుక్రవారం నిర్వహించ తలపెట్టిన ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు వెల్లడించింది.తొలి అడుగు మాత్రమే.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సాయంత్రం నిర్వహించ తలపెట్టిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతర్వేది ఉదంతంపై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలంటూ తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం దీనికి సానుకూలంగా వెలువడటం శుభ పరిణామమని అన్నారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించటంతోనే సమస్య పరిష్కారం అయినట్టు తాము భావించట్లేదని అన్నారు.సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అంటే.. నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందీ అంటే.. అంతర్వేది ఘటన ప్రమాదం కాదనే విషయాన్ని అంగీకరించినట్టయిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మున్ముందు చోటు చేసుకోకుండా ఉండటానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. హైందవ ధర్మాన్ని, హిందూయిజాన్ని, సనాతన ధర్మాన్ని ఇక ముందు కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ బాధ్యతను తాము నిర్వర్తిస్తామనీ చెప్పారు.సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అంటే.. నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందీ అంటే.. అంతర్వేది ఘటన ప్రమాదం కాదనే విషయాన్ని అంగీకరించినట్టయిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మున్ముందు చోటు చేసుకోకుండా ఉండటానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. హైందవ ధర్మాన్ని, హిందూయిజాన్ని, సనాతన ధర్మాన్ని ఇక ముందు కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ బాధ్యతను తాము నిర్వర్తిస్తామనీ చెప్పారు.