Breaking News

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ. సుస్థిర క్రీడల మహిళా విభాగం నల్గొండ జిల్లా కన్వీనర్ గా.నారాయణ కవిత.. .


నల్గొండ మండలం కొత్తపల్లి జడ్.పి.హెచ్.ఎస్ వ్యాయామ ఉపాధ్యాయులు మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి అయిన  నారాయణ కవితను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సుస్థిర క్రీడల మహిళా విభాగం నల్లగొండ జిల్లా కన్వీనర్ గా గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి  యానాల ప్రభాకర్ రెడ్డి గారు నియమించడం జరిగింది

ఈ సందర్భంగా యానాల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ జనాభాలో సగభాగం అయిన మహిళలు క్రీడలలో వెనుకబడి ఉన్నారని బాల్యం నుండి చిన్నారులు క్రీడల్లో రాణించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన  మహిళా సమాజాన్ని  నిర్మించుకోవచ్చు  తెలిపారు.గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సుస్థిర అభివృద్ధి విభాగాల్లో స్వచ్ఛందంగా పనిచేయాలని తలంపు ఉన్న మహిళా ఉపాధ్యాయులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్ల అనంత రెడ్డి, గాంధీ సంస్థల ఉమ్మడి రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, గాంధీ సంస్థల రాష్ట్ర సుస్థిర క్రీడా కార్యదర్శి బొమ్మ పాలగిరి బాబు, ఉమ్మడి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, నల్లగొండ జిల్లా సుస్థిర ప్రకృతి ఇంధన వనరుల జిల్లా అధ్యక్షులు జి వి రావు, సుస్థిర వైద్యం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు