Breaking News

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా సబితా ఇంద్రారెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో సేవలందిస్తున్న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సుస్థిర విద్యావిభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అంగీకరించడం పట్ల  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, ముఖ్య సలహాదారులు ఎంపీ గోన రెడ్డి, సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు తలకొల పురుషోత్తం రెడ్డి, గాంధీ విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర కన్వీనర్ రేపాక ప్రదీప్ రెడ్డి, డాక్టర్ కోడి శ్రీనివాసులు, యానాల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ మెరుగు మధు, పాముల అశోక్ ముదిరాజ్ మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశామన్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ
సుస్థిర విద్య, సుస్థిర ఆరోగ్యం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.
సుస్థిర విద్య విభాగానికి కి సబితా ఇంద్రారెడ్డి గౌరవ అధ్యక్షులుగా వారి ద్వారా విద్యా సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసే అవకాశం లభించిందన్నారు.. సంపూర్ణ అక్షరాస్యత కోసం నూతన విద్యా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తృతంగా కృషి చేస్తామని అన్నారు. 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు విద్యతో పాటు జీవన నైపుణ్య నైపుణ్యాలను పెంపొందించడానికి తమ సంస్థల ద్వారా విశేషంగా కృషి చేస్తున్నారు.
అటు ఆరోగ్యం ఇటు విద్యా విషయంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అందిస్తున్న సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని మనవి చేశారు. గాంధీ కుట్టి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ మెరుగు మధు, సుస్థిర క్రీడా విభాగం గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్, ఉమ్మడి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా కమిటీల తరుపున ప్రెస్ మీట్ పై విషయాన్ని పురస్కరించుకొని మీ మీ జిల్లాలో ప్రకటనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.