Breaking News

గూగుల్ పే లో కొత్త ఫీచర్


డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులు సురక్షితంగా లావాదేవీలు చేసుకునేందుకు టోకెనైజేషన్ను ప్రవేశపెట్టినట్లు గూగుల్ పే ప్రకటించింది. దీని ద్వారా ఫోన్ కు అనుసంధానమై ఉన్న డిజిటల్ టోకెన్ ద్వారా కార్డు చెల్లింపు చేసే సౌలభ్యం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం యాక్సిస్, ఎస్బీఐ కార్డు వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయాన్ని తెచ్చామని, త్వరలోనే అన్ని బ్యాంకుల వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామంది.