Breaking News

జి జి ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి


SATYASHILA TV : అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి, దొరల గడిల ను ఎదిరించి రజాకార్ల గుండెల్లో నిద్రించిన వీర వనిత మహిళా శిరోమణి చాకలి ఐలమ్మ అని డాక్టర్ యాళ్ళ ప్రేమ్ కుమార్ ముదిరాజ్ అన్నారు. చాకలి ఐలమ్మ 35 వ వర్ధంతి సందర్భంగాగాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో చింతలకుంట చౌరస్తాలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సలహాదారులు డాక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆనాడు ఐలమ్మ పోరాట పటిమ అనితర సాధ్యమైనది అని గుర్తు చేశారు. రజాకార్లపై పిడికిలి బిగించి ఆమె చూపిన తెగువ నేటి యువతకు ఎంతో ఆదర్శం అన్నారు. నేడు అనగారిన కులాలు ఐక్యంగా పోరాడి రాజ్యాధికారం సాధించుకోవాలని అన్నారు.కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, ఉమ్మడి రాష్ట్రాల ప్రచార కార్యదర్శి అశోక్ ముదిరాజ్, సుభాష్, లక్ష్మణ్ ముదిరాజ్, యాదగిరి, శ్రీకాంత్, మోర శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.