Breaking News

భారత్ లో అమెజాన్ లక్ష ఉద్యోగాల కల్పన : త్వరలో కార్యాచరణ


SATYASHILA TV, జాబ్స్  : అమెజాన్ భారీగా , ఏకంగా 1,00,000 ఉద్యోగాలను ప్రకటించింది. అమెరికా, కెనెడా మార్కెట్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఫుల్‌ఫిల్‌మెంట్, లాజిస్టిక్స్ నెట్వర్క్‌లో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్స్ ఇవి. ఇప్పటికే 33,000 కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగాలను ప్రకటించింది అమెజాన్. ఇవి కాకుండా మరో 1,00,000 జాబ్స్ ప్రకటించింది. ఎంపిక చేసిన నగరాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలకు గంటకు 15 డాలర్ల నుంచి చెల్లించనుంది. దీంతో పాటు సైన్ ఆన్ బోనస్ 1000 డాలర్లు ఇవ్వనుంది. ఇక ఫుల్ టైమ్ ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. మొదటి రోజు నుంచే హెల్త్, విజన్, డెంటల్ ఇన్స్యూరెన్స్, 20 వారాల వరకు పేరెంటల్ లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి. అమెజాన్ ఇన్నొవేటీవ్ కెరీర్ ఛాయిస్ ప్రోగ్రామ్ ద్వారా డిమాండ్ ఉన్న కోర్సులకు 95 శాతం ట్యూషన్ ఫీజు చెల్లించనుంది అమెజాన్.