Breaking News

ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన, కోర్సుల కోసం ప్రత్యెక పోర్టల్


SATYASHILA TV : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 15 నెలలూ పథకాలు, హామీల అమలుపై దృష్టి పెట్టి... ఇప్పుడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా... ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన, కోర్సుల వివరాల్ని తెలిపేందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌ (apcareerportal.in)ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. APSCERT, యూనిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ ఈ పోర్టల్ వచ్చేందుకు కృషి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకెండరీ స్థాయి విద్యార్థుల చదువులతో పాటు భవిష్యత్‌లో ఎంచుకోబోయే ఉపాధి కోర్సులను, వాటి ద్వారా పొందే ఉద్యోగాల వివరాల్ని ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు తెలుసుకోగలరు. ఇది రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడనుంది.