Breaking News

పైనాపిల్ లో బహు విటమిన్స్ ...


కాస్త పులుపు తీపి రుచి కలిగిన పైనాపిల్ అంటే మనలో చాలా మందికి ఇష్టం. ప్రస్తుతం పైనాపిల్ చాలా విరివిగా లభ్యమవుతున్నాయి. విటమిన్ ఏ బి సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కంటి చూపు మెరుగు పడుతుంది.మనలో చాలా మందికి పైనాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది అన్న విషయం తెలుసు. కానీ అందాన్ని కూడా పెంచుతుంది అని మనలో చాలా మందికి తెలియదు. మొటిమలను తగ్గించడంలోనూ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక స్పూన్ పైనాపిల్ జ్యూస్ లో అర స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా చేస్తూ ఉంటే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలిగిపోతాయి. చర్మంపై మృతకణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరవాలంటే ఈ ప్యాక్ చాలా కరెక్ట్ గా పనిచేస్తుంది పైనాపిల్ ముక్కలను పేస్ట్ చేసి దానిలో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.