Breaking News

ధోనీకి భారీ షాక్ ఇచ్చిన అంబటి రాయుడు


గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్‌ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్‌ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అంబటి తాజా నిర్ణయం దేశవాళీలకే పరిమితమా లేక ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌కు కూడా వర్తిస్తుందో చూడాలి. ఐపీఎల్‌‌తో పాటు మళ్లీ ఇండియాకు ఆడాలని ఆసక్తిగా ఉన్నానని రాయుడు ఇటీవలే హింట్‌‌ ఇచ్చాడు. ఈ లెక్కన ఇండియాకు మళ్లీ ఆడాలని ఆశిస్తున్నట్టు అర్థమవుతోంది. వచ్చే నెల 24న మొదలయ్యే విజయ్‌‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌‌ తరఫున రాయుడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్‌‌క్లాస్‌‌ క్రికెట్‌‌ నుంచి అంబటి గతంలోనే తప్పుకున్నాడు.. తెలుగు స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇటీవలి ప్రపంచకప్‌ టోర్నీకి తనను ఎంపిక చేయకపోవడంపై ఒకింత మనస్థాపానికి గురైన రాయుడు అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే గడ్డుకాలంలో సీఎస్‌కే యాజమాన్యం, వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌ అండగా నిలువడంతో రాయుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో రానున్న సీజన్‌లో హైదరాబాద్‌కు తాను అందుబాటులో ఉంటానంటూ హెచ్‌సీఏ సీఈవోకు గురువారం లేఖ రాశాడు. తెలుగుతేజం, భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బరిలోకి దిగబోతున్నాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాడు. హెచ్‌సీఏ వన్డే, టి20 క్రికెట్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు. వరల్డ్‌‌కప్‌‌కు సెలెక్ట్‌‌ చేయలేదన్న ఆవేదనతో కెరీర్‌‌కు రిటైర్మెంట్‌‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌‌, హైదరాబాదీ అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడు. గత నెలలో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న రాయుడు తన రిటైర్మెంట్‌‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు 2019–20 డొమెస్టిక్‌‌ సీజన్‌‌ లిమిటెడ్‌‌ ఓవర్ల ఫార్మాట్‌‌లో హెచ్‌‌సీఏ తరఫున బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని హెచ్‌‌సీఏ సీఈఓ గురువారం ప్రకటించారు.