Breaking News

కరోనా తీవ్రత దృష్ట్యా భారత్ సౌదీ అరేబియా విమాన సర్వీస్‌లు బంద్


భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో భారత్ నుంచి విమానాల రాకపోకలను సౌదీ అరేబియా మంగళవారం నుంచి నిషేధించింది. ఈ నిషేధంలో బ్రెజిల్, అర్జెంటీనా కూడా ఉన్నాయి. 14 రోజుల్లోగా ఈ మూడు దేశాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సౌదీ అరేబియాకు రావడానికి అనుమతి ఉండబోదని, ప్రభుత్వ ఆహ్వానం ఉన్నవారు తప్ప మరెవరికీ అనుమతించేది లేదని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ) మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. భారత్‌కు చెందిన విమానాలు సౌదీ అరేబియాలో సేవలు అందించేందుకు అనుమతి లేదని, అదే శిధంగా గల్ఫ్ దేశాల నుంచి కూడా భారత్‌కు విమానయాన సేవలు సెప్టెంబర్ 24 వరకు అందుబాటులో ఉండవని ఓ విమానయాన సంస్థ అధికారి తెలిపారు.
సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్‌ల్లో భారతీయ వలస కార్మికులు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. అరబ్ ఎమిరేట్స్‌లో దుబాయ్ అత్యధిక జనాభా కలిగిన నగరం. ఆగస్టు 28, సెప్టెంబర్ 4న కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్లతో ఇద్దరు ప్రయాణికులను భారత్ నుంచి తీసుకెళ్లిన విమాన సర్వీసులను 24 గంటలపాటు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధారిటీ ఆపివేసిందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐదురోజుల క్రితం వెల్లడించింది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినప్పటికీ వందేభారత్ మిషన్ కింద ప్రత్యేక విమానసర్వీసులు మే 6 నుంచి భారత్ సౌదీ అరేబియా మధ్యనడిచాయి.