Breaking News

అమెరికాలో ఓ తెలుగు యువతి దుర్మరణం


SATYASHILA TV : అమెరికాలో ఓ తెలుగు యువతి దుర్మరణం చెందింది. అట్లాంటాలోని జలపాతంలో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందింది. మృతురాలు కృష్ణా జిల్లాకు చెందిన కమలగా గుర్తించారు. ఎంఎస్ పూర్తి చేసిన కమల ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఆమె నీటిలో పడి ప్రాణాలు కోల్పోయింది. అక్కడి తెలుగు సంఘాలు సహకారంతో ఆమె మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.