Breaking News

భూమి వైపు ముంచుకు వస్తున్న భారీ ప్రమాదం


SATYASHILA TV : ఈజిప్టులోని గీజా పిరమిడ్‌ కంటే రెండు రెట్లు పెద్దదిగా ఉండే భారీ గ్రహశకలం(ఆస్టరాయిడ్‌) ఆదివారం (సెప్టెంబరు 6) అర్ధరాత్రి భూమికి అత్యంత సమీపంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నాసా తెలిపింది. దాని కదలికలపై నిఘాకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకటించింది. 465824 (2010 ఎఫ్‌ఆర్‌) అనే పేరు కలిగిన ఈ గ్రహ శకలం పరిమాణం 120 మీటర్ల నుంచి 270 మీటర్ల వ్యాసం(డయామీటర్‌) మేర ఉంటుందని తెలిపింది. అయితే అది భూమి వైపు దూసుకొచ్చే అవకాశాలు లేవని నాసా స్పష్టంచేసింది. చంద్రుడి కంటే సుదూరాన.. భూమికి 4.6 మిలియన్‌ మైళ్ల దూరంలో, గంటకు 31,400 మైళ్ల వేగంతో ఆ ఆస్టరాయిడ్‌ వెళ్తుందని అంచనా వేసింది. 2010 మార్చి 18న క్యాటలీనా స్కై సర్వే (సీఎ్‌సఎ్‌స)లో ఈ గ్రహశకలాన్ని గుర్తించినప్పటి నుంచే, దాని కదలికలపై నాసా నిఘా పెట్టడం విశేషం.