Breaking News

తెలుగు రాష్ట్రాలలో విజృంభిస్తున్న మహమ్మారి


రికార్డు స్థాయిలో కరోనా రెచ్చిపోతోంది. దేశంలోనే రెండో స్థానానికి చేరుకుని తమిళనాడును మూడో స్థానానికి చేర్చింది. గడిచిన 24 గంటల్లో 72,573 నమూనాలు పరీక్షించగా 10,794 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,98,125కు పెరిగింది. ఇక గడచిన 24 గంటల్లో కరోనాతో 70 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చనిపోయినవారి సంఖ్య 4,417కు చేరింది.
చనిపోయినవారిలో చిత్తూరు జిల్లాలో(9), అనంతపురం(8), గుంటూరు(8), ప్రకాశం(8), కడప(7), తూర్పు గోదావరి(5), విశాఖపట్నం(5), పశ్చిమ గోదావరి(5), కృష్ణా(4), కర్నూలు(4), నెల్లూరు(4), శ్రీకాకుళం(2), విజయనగరం(1)గా మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి కోలుకుని 11,915 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 3,94,019కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 99,689 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు 41,07,890 కరోనా పరీక్షలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. తాజా పరీక్షల్లో 35,358 ట్రూనాట్‌ పద్ధతిలో, 37,215 ర్యాపింగ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు.