Breaking News

ఐపీఎల్ ఓ క్రికెట్ సంగ్రామం. క్రికెట్ అభిమానుల‌కు స‌రికొత్త‌ పండుగ.


SATYASHILA TV : ఐపీఎల్ ఓ క్రికెట్ సంగ్రామం. క్రికెట్ అభిమానుల‌కు స‌రికొత్త‌ పండుగ. అనుక్ష‌ణం ఉత్కంఠ‌.. అంతులేని ఉత్స‌హాం.. ఈ స‌మ‌రం మొద‌లు కావ‌డానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. బీసీసీఐ కూడా త‌ర్వ‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టించ‌నున్న‌ది. ప్ర‌తి ఏడాది ఈ స‌మ‌రం ప్రారంభానికి ముందు ఐపీఎల్‌ అభిమానుల మ‌ధ్య మొద‌లయ్యే గొడ‌వ ఒక‌టే. ఏ టీంకు ఎక్కువ మంది అభిమానులున్నారు. ఏ టీంకు ఎక్కువ మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈ ప్ర‌శ్న‌కు క‌చ్చితమైన స‌మాధానం చెప్ప‌డం సాధ్యం కాదు. అయితే, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షెడ్యూల్ ఎట్టకేల్లకు విడుదలైంది. ఈ నెల 19 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. ఐపీఎల్ 2020 సీజన్ మూడు వేదికల్లో మొత్తం 53 రోజులు జరగనుండగా.. 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. తోలి మ్యాచ్ ముంబై ఇండియాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అబుదాబి వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 07:30 ని.లకు మ్యాచ్ లు ప్రసారం కానుండగా.. ఓకే రెండు మ్యాచ్ లు ఉన్న సమయంలో మాత్రం మధ్యాహ్నం 3:30ని.లకు ప్రసారమవుతుందని తెలిపింది