Breaking News

యూజర్స్ కి మరింత ప్రైవసీ నిచ్చే ఫీచర్స్ తేనున్న ఫేస్బుక్


SATYASHILA TV :ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు పంపుకొనేందుకు ఉన్న మెసెంజర్‌ ఆప్షన్‌ తెలిసిందే. తప్పడు సమాచారం వైరల్‌ కాకుండా అడ్డుకునేందుకు మేసెజ్‌ ఫార్వార్డింగ్‌ను ఫేస్‌బుక్‌ తాజాగా పరిమితం చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ఒకసారి అయిదుగురు వ్యక్తులు లేదంటే అయిదు గ్రూపులకు మాత్రమే సమాచారాన్ని పంపుకోవచ్చు. కొవిడ్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మెసెంజర్‌ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకుంది. దీంతో ఇకపై వైరస్‌ మాదిరిగా తప్పుడు సమాచారాన్ని వైరల్‌ చేసే వీలు ఉండదు. మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఈ మధ్య కాలంలో తరచూ విమర్శలకు గురవుతున్న విషయం విదితమే.