Breaking News

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మరో మారు అగ్ర స్థానాన్ని పొందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ


ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నరు. 871 పాయింట్స్ లో కోహ్లీ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ (855) ఉన్నారు. పాకిస్థాన్ ఆటగాడు. బాబార్ అజామ్ (829) మూడో స్థానంలో నిలిచారు. వన్డే ర్యాకింగ్స్ లో టాప్ -2 స్థానాలు భారత్ వే అన్నమాట.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన ఓపెనర్‌ బెయిర్‌ స్టో టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌తో ఆఖరిదైన మూడో వన్డేలో బెయిర్‌స్టో 126 బంతుల్లో 112 పరుగులు చేసి రేటింగ్‌ పాయింట్లు పెంచుకున్నాడు. ఇక వన్డే బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచారు. టీమిండియా పేసర్‌ బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అఫ్గనిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ 301 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. రవీంద్ర జడేజా 8వ స్థానంలో నిలిచారు.