Breaking News

జి .జి. ఎఫ్. ప్రకృతి వైద్య ఆశ్రమం కరపత్రం ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్


వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ సిద్ధార్థ యోగ విద్యాలయం, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, వినోబా నగర్ లో  నిర్వహిస్తున్న ప్రకృతి వైద్య ఆశ్రమ కరపత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన నివాసంలో ఆవిష్కరించినట్లు గాంధీ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.గాంధీ సంస్థలు ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ కే వై రామచందర్ రావు, 
ఎం. జి. పద్మ, ఉచిత వైద్య ప్రకృతి వైద్య సేవలను అందిస్తున్నందుకు ఈ సందర్భంగా మంత్రి అభినందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైద్యం తో సహజ ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సుస్థిర వైద్యము, సుస్థిర ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు చేరువయ్యే టట్లుగా గాంధీ సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు.గాంధీజీ 150వ జయంతి ముగింపు ఉత్సవాలకు  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నిర్వహించబోయే అక్టోబర్ 2 గాంధీ జయంతి వేడుకలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్  గారిని ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రస్మా నాయకులు కొండవీటి మధుసూదన్ రెడ్డి, గాంధీ సంస్థల ఉమ్మడి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.