Breaking News

చైనా లో ఒలంపిక్స్ నిర్వహణ మంచిదేనా ....?ఆర్టికల్ :  2022లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ను బీజింగ్‌లో నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలిని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి)కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు160 కి పైగా మానవ హక్కుల సంఘాలు లేఖలు రాశాయి. ప్రతి ఖండంలోని మానవ హక్కుల సంస్థలు సంతకం చేసిన ఈ లేఖలను ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్‌కు పంపించారు. జిన్జియాంగ్, టిబెట్, హాంకాంగ్ మరియు ఇన్నర్ మంగోలియాలో చైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి చైనాకు అర్హత లేదని లేఖలో పేర్కొన్నాయి.

కాగా ఈ లేఖపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ బుధవారం బీజింగ్‌లో ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ ఈ లేఖ క్రీడలను "రాజకీయం" చేయడానికి ప్రయత్నిస్తోందని, ఈ చర్యను చైనా "గట్టిగా వ్యతిరేకిస్తుంది" అని అన్నారు. రాజకీయ సమస్యలపై వారు తటస్థంగా ఉన్నారని, ఒలింపిక్ క్రీడలు చైనాలో జరపడానికి ఐఓసీ నిర్ణయం తీసుకుందంటే "చైనా దేశంలోని రాజకీయ నిర్మాణం, సామాజిక పరిస్థితులు లేదా మానవ హక్కుల ప్రమాణాలతో అంగీకరిస్తుందన్న అర్థం కాదు" అని ఐఒసి తెలిపింది.2024 ఏడాదిలో జరిగే సమ్మర్ ఒలింపిక్స్ క్రీడల నుంచి ఒలింపిక్ హోస్ట్ సిటీ, మానవ హక్కులు, అవినీతి నిరోధక మరియు స్థిరమైన అభివృద్ధి నిబంధనలను జోడిస్తామని ఐఓసి 2017లోనే తెలిపింది. 2008లో బీజింగ్లో మొదటిసారి జరిగిన ఒలింపిక్స్ చైనా రాజధాని బీజింగ్‌ మొట్టమొదటిసారిగా 2008లో సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇది ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారి ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా చైనా ఎదగనుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

దీనిపై అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్తో సహా దేశ మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, పాలక చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒలింపిక్స్ను విజయవంతం చేయడానికి అపారమైన డబ్బు వెచ్చించింది. హ్యూమన్ రైట్స్ వాచ్‌తో చైనా పరిశోధకుడు యాకియు వాంగ్ మాట్లాడుతూ ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడం చైనా ప్రభుత్వానికి "అపారమైన గర్వం" కలిగించిందని అన్నారు.

2008 ఒలింపిక్స్ వారి మానవ హక్కుల ఉల్లంఘనను చట్టబద్ధం చేయడానికి ఒక మార్గాన్ని ఇచ్చింది, ఇది బీజింగ్ ఖ్యాతి లాండ్రీ లాంటిది" అని ఆమె చెప్పారు. కాగా హ్యూమన్ రైట్స్ వాచ్ 2022లో బీజింగ్లో జరగబోయే ఒలింపిక్స్ను తరలించాలని పిలుపునిచ్చే లేఖకు సంతకం చేయలేదు. ఓస్లో, మ్యూనిచ్ మరియు స్టాక్‌హోమ్ వైదొలిగిన తరువాత బీజింగ్ మరియు అల్మట్టి, కజాఖ్స్తాన్ మాత్రమే 2022 గేమ్స్ కోసం పోటీలో ఉన్నాయి.

కానీ 2015 నుండి చైనా ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు క్రమంగా పెరుగుతున్నాయన్న విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా జిన్జియాంగ్‌లో ముస్లిం పౌరులను సామూహికంగా నిర్బంధించడం మరియు హాంకాంగ్‌లో పౌర స్వేచ్ఛను కోయడం వంటి మానవ హక్కుల ఉల్లంఘనలు చైనాలో జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. తాజాగా హాంకాంగ్లో చైనా ప్రభుత్వం కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని విధించింది, జూన్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష శాసనసభ్యులు, బీజింగ్‌ను విమర్శించే వ్యాపారవేత్తలను ఇప్పటికే హాంకాంగ్‌లో అరెస్టు చేశారు. హాంకాంగ్‌ నగరాన్ని రక్షించడానికే ఈ చర్యలు చేపట్టామని చైనా అధికారులు ఈ చట్టాన్ని సమర్థించారు.