Breaking News

త్వరలోనే కరోనాను కట్టడి చేసే రష్యా రెండో కొవిడ్‌ టీకా రిజిస్టర్‌!


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసే మొదటి టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా.. త్వరలోనే రెండో వ్యాక్సిన్‌తో ముందుకొస్తోంది. తమ దేశంలో రెండో కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేయబోతున్నామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. రష్యా ఎగువ సభ చట్టసభ సభ్యులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

వెక్టర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన ఎపివాక్ కరోనాగా పిలుస్తున్న మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 లోగా రిజిస్టర్‌ చేస్తామని నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌ వాచ్‌డాగ్ తెలిపింది. అలాగే, కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశ సామర్థ్యాన్ని పుతిన్ అభినందించారు. కొవిడ్‌-19 ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ ప్రకారం..కొవిడ్ కేసుల సంఖ్యలో రష్యా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఆ దేశంలో 11,17,487 కేసులు నమోదు కాగా, 19,720 మంది మరణించారు.