Breaking News

రేపటి నుండే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. అందుకోసం అసెంబ్లీ, మండలిలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో సభ్యులు 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా.. అసెంబ్లీలో అదనంగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు కేటాయించారు. సభ్యులంతా విధిగా మాస్క్ ధరించాలి. సమావేశాల ప్రారంభానికి ముందే అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఆదివారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావుకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. మరింత అప్రమత్తమైన అసెంబ్లీ అధికార యంత్రాంగం సభ్యులందరికి పరీక్షలు చేస్తోంది. నెగెటివ్ వచ్చిన మారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇక సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని అధికార, విపక్షాలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. అన్ని అంశాలపై చర్చిద్దామని.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శంగా ఉండేలా నడుచుకుందామని ఇప్పటికే సీఎం కేసీఆర్ అన్ని పార్టీలకు సూచించారు. ఈసారి సమావేశాల్లో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు, సెక్రటేరియెట్ కూల్చివేత, ఉస్మానియా ఆస్పత్రి భవనం, కొత్త రెవెన్యూ చట్టంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.గత అసెంబ్లీ సమావేశాల్లో కరోనాపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తుచేస్తున్నారు విపక్ష నేతలు. రాష్ట్రానికి కరోనా రాకుండా అడ్డుకుంటామని నాడు ముఖ్యమంత్రి చెప్పారు.