Breaking News

జి జి ఎఫ్ వ్యాసరచన పోటీ విజేతలకు పురస్కారాల ప్రదానం


SATYASHILA TV : గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు ఆదివారం ఉదయం 11 గంటలకు బహుమతి పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం ఉందని గాంధీ సంస్థల రాష్ట్ర చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు. గత మే నెలలో రాష్ట్ర స్థాయిలో "సుస్థిర భవిష్యత్తు కై గాంధీ జీవనమార్గం" అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు , 65 మంది రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన వారిలో ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు రూ. 25000, 12000, 6000 నిర్ణయించినట్లు తెలిపారు. నిర్ణయించిన ఈ పోటీలో పలువురు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు విజేతల వివరాలు ప్రకటించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గార్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి విజేతలుగా నిలిచారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సుస్థిర వైద్య రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ కే వై రామచంద్రరావు, గాంధీ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి, సోషల్ ఫోరం అధ్యక్షులు రథంగపాణిరెడ్డి గార్ల చేతుల మీదుగా నగదు పురస్కారం తోపాటు జ్ఞాపిక, ప్రశంసాపాత్రాలు అందుకోనున్నారు.