Breaking News

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నల్లగొండ జిల్లా క్రీడల విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా... కేతావత్ శ్రీనివాస్.

వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ సిద్ధార్థ యోగ విద్యాలయం, ఇబ్రహీంపట్నం ప్రకృతి ఆశ్రమం లో గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి  యానాల ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోనల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్  నేరేడుగోమ్మ మండల T.S. మోడల్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కేతావత్ శ్రీనివాస్ ను  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా సుస్థిర 
క్రీడా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి  ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ K.Y.రామచంద్రరావు లు సంయుక్తంగా ఆయనకు నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గున్న రాజేందర్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుండి, గిరిజన తండాల నుండి ఆర్థికంగా ,సామాజికంగా వెనుకబడిన ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసే క్రమంలో సంస్థల సుస్థిర రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరి బాబు ఆధ్వర్యంలో సుస్థిరమైన క్రీడా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ స్వచ్ఛందంగా క్రీడలకు సేవ చేయదల్చిన ప్రభుత్వ మరియు ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను మరియు క్రీడాకారులను సంస్థలు ఆహ్వానిస్తున్నామని వారు తెలిపారు.
ముఖ్యఅతిధి డాక్టర్ కే వై రామచందర్ రావు  మాట్లాడుతూ ఒక స్వచ్ఛంద సంస్థ గా ఎలాంటి లాభాపేక్ష లేకుండా గాంధీ  సంస్థలు ప్రతిభ కలిగిన క్రీడాకారులను  వెలికి తీయడానికి ముందుకు రావడమే కాకుండా వ్యాయామ ఉపాధ్యాయుల ను మంచి ఆర్గనైజర్లు గా తయారు చేసే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సంస్థల రాష్ట్ర సుస్థిర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరి బాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెరుగు మధు, ప్రచార కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బుర్ర దశరథ్ గౌడ్, రంగారెడ్డి జిల్లా సంస్థల అధ్యక్షులు బొల్లగోని వెంకటేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా GGF సుస్థిర క్రీడల కార్యదర్శి కుడుముల భాస్కర్ రెడ్డి మరియు సంస్థల రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు.