Breaking News

త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ భేటీ


SATYASHILA TV ,న్యూఢిల్లీ : త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఎల్‌ఏసీ వెంట జరుగుతున్న పరిణామాలపై వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల సమావేశం మాస్కోలో జరిగిన తర్వాత, ఇరు దేశాల మధ్య ఐదు సూత్రాల ఒప్పందం కుదిరిన తర్వాత ఈ భేటీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఎల్ఏసీ వెంట అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించనున్నారు. మరోవైపు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణానికి ముగింపు పలకాలని భారత్, చైనా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఎల్ఐసీ వెంట భారీ ఆయుధాలతో చైనా దళాలు మోహరించడంపై విదేశాంగ మంత్రి జయశంకర్ తీవ్రంగా మండిపడినట్లు సమాచారం.