Breaking News

భారత్ చైనా సరిహద్దుల్లో రోజురోజుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు


భారత్ చైనా సరిహద్దుల్లో రోజురోజుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్-చైనా మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ అవి కాస్త విఫలం అవుతూనే ఉన్నాయి. చర్చల్లో ఎన్ని ఒప్పందాలు జరిగినప్పటికీ చైనా ఆ తర్వాత మాత్రం ఒప్పందాల్లో జరిగిన విషయాలను మర్చిపోయి తోక జాడిస్తూనే ఉంది సరిహద్దుల్లో . ఈ నేపథ్యంలో దూకుడు పెంచిన భారత్ ఏకంగా చైనా కు సంబంధించిన వ్యూహాత్మక ప్రదేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు రోజురోజుకు కమ్ముకుంటున్నాయి. అయితే భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. భారత్ ఒక యుద్ధం కాదు ఏకంగా నాలుగు యుద్ధాలు చేయాలి నిపుణులు చెబుతున్నారు. చైనాతో ఘర్షణల జరుగుతున్న పాకిస్తాన్ సైలెంట్ గానే ఉంది. అయితే ఇటీవలే నవంబర్లో గిల్జిట్ బల్జిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది పాకిస్తాన్. దీనిని భారత్ ఎట్టి పరిస్థితిలో అడ్డుకునే అవకాశం ఉంది. అదే సమయంలో మరో వైపు నుంచి నేపాల్ కూడా చైనాకు మద్దతుగా నిలబడి భారత్ తో యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యింది.