Breaking News

ఏపీలో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు :


ఏపీలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ వేదికగా ఈ ప్రకటన చేసిన కేంద్రం అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్రం తెలిపింది. దీనికోసం అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు గా కేంద్రం పేర్కొంది. అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటులో భాగంగా 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను ఏర్పాటుచేయనున్నట్లుగా పేర్కొంది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని రకాల అధ్యయనాల తర్వాతనే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లుగా కేంద్రం తెలిపింది.అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారమే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారమే శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేశామని కేంద్రం చెప్పింది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసింది . గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్లాంట్ నిర్మాణానికి త్వరలో చర్యలు ప్రారంభించడానికి ఉభయ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య అంగీకారం కుదిరిందని, ఈ సంవత్సరం శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.