Breaking News

ఆధునిక టెక్నాలజీ అందరికి చెరువ అవ్వాలి -కేటీఆర్


ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటే సామాన్యుల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్... ఐటీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర - భారత దేశం చేపట్టాల్సిన చర్యలు అనే అంశం పైన నాస్కామ్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సగటు మానవుని జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తున్నాయన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వ్యవసాయ రంగం, లా అండ్ ఆర్డర్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అవకాశం ఉందన్న కేటీఆర్... ఏ టెక్నాలజీ వినియోగం అయినా సగటు మానవుడి జీవితంలో సానుకూల మార్పు లక్ష్యంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.. ఆధునిక టెక్నాలజీలను ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్.