Breaking News

చినజీయర్ స్వామికి కేసీఆర్ పరామర్శ


SATYASHILA TV  : త్రిదండి చినజీయర్‌ స్వామిని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. చినజీయర్‌ స్వామికి మాతృ వియోగం కలిగింది. దీంతో అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్.. చినజీయర్‌ ఆశ్రమానికి వెళ్లారు. చినజీయర్‌ స్వామికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో నారాయణగూడలోని కూతురు నివాసంలో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ ఆశ్రమంలో చినజీయర్‌ స్వామిని కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్‌ను కలిసి కేసీఆర్ సానుభూతి తెలిపారు.

కేసీఆర్‌తో మైంహోం రామేశ్వరరావు కూడా స్వామిని పరామర్శించారు. ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా చిన్నజీయర్ స్వామిని పరామర్శించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు చినజీయర్ స్మామిని పరామర్శించారు. ఆదివారం ఉదయం చినజీయర్‌ స్వామితో వెంకయ్య మాట్లాడారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.