Breaking News

అదుపు తప్పినా ప్రైవేటు లగ్జరీ బస్సు : నిద్రమత్తులో డ్రైవర్ల నిర్లక్ష్యంఅదుపు


ప్రైవేటు లగ్జరీ బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు గాయాలయ్యాయి.  
నిద్రమత్తులో డ్రైవర్ల నిర్లక్ష్యం పలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాటకన్‌ గూడెంలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణారెడ్డి, ఆయన సతీమణి వెంకటమ్మ స్వల్పంగా గాయపడ్డారు.నిద్రమత్తులో డ్రైవర్ల నిర్లక్ష్యం పలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాటకన్‌ గూడెంలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణారెడ్డి, ఆయన సతీమణి వెంకటమ్మ స్వల్పంగా గాయపడ్డారు.వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రైవేటు బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు ఇళ్లు, కూలిపోయాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. బస్సు ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.