Breaking News

‘బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌’గా టీం ఇండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్


ప్రపంచ కప్ తర్వాత టీమిండియాలో అనేక మార్పులు జరుగుతున్న విషయం తెలిసేందే,త ఇప్పటికే కోచ్ లను మార్చే పనిలో పడ్డారు సెలక్టర్లు. ఇప్పుడు బీసీసీఐని సెట్ చేసే పనిలో పడ్డారుచ. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా టీం ఇండియా మాజీ క్రికెటర్, కోచ్ అనిల్ కుంబ్లేని నియమించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. చీఫ్ సెలక్టర్‌ పదవికి కుంబ్లే అన్ని విధాలా అర్హుడని ఆయన పేర్కొన్నారు. ‘‘అనిల్ కుంబ్లే సెలక్టర్ల ఛైర్మన్ పదవికి సరైన అభ్యర్థి. సచిన్, సౌరవ్, రాహుల్‌లతో అతనికి మంచి అనుబంధం ఉంది. అంతేకాక.. కోచ్‌గా ఆటగాళ్లతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి’’ అని సెహ్వాగ్ అన్నారు.

ప్రస్తుతం ఉన్న చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌పై విమర్శలు ఉన్నాయి. ప్రపంచకప్ జట్టు ఎంపికలో.. అంతకు ముందు టెస్ట్‌ సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్ల విషయంలోనూ ఆయనపై ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ను చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తప్పించాలని కూడా కొందరు డిమాండ్ చేశారు.

అయితే కుంబ్లే ఆటగాళ్లకు ఎంతో మనోధైర్యంన్ని ఇవ్వగలడని సెహ్వాగ్ అన్నారు. 2007-08 ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు కుంబ్లే మా కెప్టెన్. అప్పుడు అతను నాకు ఎంతో ధైర్యం చెప్పాడు. రెండు సిరీస్‌ల వరకూ నువ్వు జట్టులోనే ఉంటావు అని అన్నాడు’’ ఈ మాటలు తనకు ఎంతో కాన్‌ఫిడెన్స్ ఇచ్చాయని సెహ్వాగ్ స్పష్టం చేశారు.

అంతేకాక.. కుంబ్లే చీఫ్ సెలక్టర్‌ను చేసి అతని వేతనం కూడా పెంచాలని సెహ్వాగ్ బీసీసీఐని కోరాడు. ప్రస్తుతం ఛైర్మన్‌కి ఏడాదికి రూ.కోటి చెల్లిస్తున్నారు. దీన్ని పెంచకుంటే కుంబ్లే ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చెప్పట్టేందుకు ఒప్పుకోరని సెహ్వాగ్ అన్నారు.