Breaking News

మహీంద్రా యూనివర్సిటీ ఎకోల్ ఎంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం


హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ ఎకోల్ ఎంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్- MEC బీటెక్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తు గడువు 2020 సెప్టెంబర్ 18న ముగుస్తుంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. 2020-2024 విద్యాసంవత్సరానికి ఈ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటేషన్ అండ్ మ్యాథమెటిక్స్ లాంటి కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. జేఈఈ మెయిన్స్ ర్యాంక్, శాట్ స్కోర్ ఆధారంగా లేదా ఏసీటీ స్కోర్, 10+2 ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు పొందొచ్చు. మరిన్ని వివరాలకు https://www.mahindraecolecentrale.edu.in/ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.