Breaking News

శాంతి కోసం అశాంతిని సహించని తత్వం కాలోజిది : గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి


SATYASHILA TV : శాంతి కోసం అశాంతిని సహించని తత్వం కాలోజిది అని గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీ కుటీర్ లో ఏర్పాటుచేసిన కాళోజీ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న బాధలను తనకు కలిగిన విపత్తుగా భావించి భారతీయ సనాతన ధర్మం కోసం నా గొడవ అనే గ్రంథాన్ని రచించి సాహితీవేత్తలకు స్ఫూర్తిని నింపాలని అన్నారు.ఆయన స్వయానా లెఫ్టిస్ట్ భావాలు కలిగిన కలిగి సమాజం కోసం ముఖ్యంగా తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం ప్రథమ ఉద్యమకర్త గా నిలిచారని గుర్తుచేశారు. గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి ఇ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విష్ణు దేవ్,గాంధీ విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర కన్వీనర్ రేపాక ప్రదీప్ రెడ్డి, జి జి ఎఫ్ సుస్థిర వ్యవసాయ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నక్క శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ ప్రేమ్ కుమార్ ముదిరాజ్, జిఎఫ్ మహిళా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మైనేని వాణి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, పాముల అశోక్ ముదిరాజ్, కుడుముల భాస్కర్ రెడ్డి, బి వి టి గౌడ్, డి .గోపాల్ రెడ్డి, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు