Breaking News

టీసీఎస్ ఐయాన్ టీచర్ల కోసం ప్రత్యేక కోర్సు


SATYASHILA TV : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ ఐయాన్ టీచర్ల కోసం ప్రత్యేక కోర్సును రూపొందించింది. 'కెరీర్ ఎడ్జ్-డిజిటల్ టీచర్' పేరుతో ఈ కోర్సును అందిస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా టీసీఎస్ అయాన్ విద్యార్థులతో పాటు వేర్వేరు వర్గాలకు ఉచిత కోర్సుల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును రూపొందించింది. ఇది ఉచిత కోర్స్. టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారు ఎవరైనా ఈ కోర్సు ఉచితంగా చేయొచ్చు. డిజిటల్ టీచింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు. కోర్సు వ్యవధి 15 రోజులు మాత్రమే. రోజూ 1 నుంచి 2 గంటలు కోర్సు కోసం కేటాయిస్తే చాలు. డిజిటల్ టీచింగ్‌కు కావాల్సిన స్కిల్స్‌ని ఉచితంగా నేర్చుకోవచ్చు. డిజిటల్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులో వేర్వేరు బోధనా పద్ధతులు, వ్యూహాలు తెలుసుకోవచ్చు. ఇందులో డిజిటల్ లెర్నింగ్ టూల్స్ ఉంటాయి.