Breaking News

లవంగాలతో ప్రయోజనాలు : ఎప్పుడు ఎలా వాడాలి ,...!



- లవంగాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ డామేజ్‌తో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
- లవంగంలోని బలమైన జెర్మిసైడల్‌ లక్షణాలు పంటి నొప్పి, గొంతు, చిగుళ్ళు, పూతల నివారణకు సహాయపడతాయి.
- క్రిమినాశక, యాంటీవైరల్‌, యాంటీమైక్రోబయల్‌ లక్షణాలు లవంగాలలో సమద్ధిగా ఉంటాయి. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పిని నయం చేయడానికి లవంగాలు సహాయపడతాయి.
- లవంగంలో ఉన్న యూజీనాల్‌ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ బరువు తగ్గడానికి కీలకం. లవంగం సహజంగా జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.
- లవంగాలు ఫ్రీ రాడికల్‌ చర్యతో పోరాడటం ద్వారా, అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. - లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. మరీ ముఖ్యంగా టీ తయారీలో లవంగాలను ఉపయోగించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
లవంగం టీ తయారీ విధానం :
- టేబుల్‌ స్పూన్‌ లవంగాలను మెత్తగా చేసుకోవాలి.
- ఓ గిన్నెలో, కప్పు నీరు పోసి తరువాత లవంగాల పొడి వేసి మరిగించాలి.
- మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు ఆగండి.
- కాస్త చల్లబడగానే వడబోసి తాగండి.