Breaking News

అరటి పువ్వుతో అరవై ప్రయోజనాలు


దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాంటి పదార్థాల్లో అరటి పువ్వు ఒకటి. అరటి పండు తరహాలోనే అరటి పువ్వులో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. చెప్పాలంటే.. అరటి పండు కంటే మెరుగైన ఔషద గుణాలు ఇందులో ఉన్నాయట. ఇది అనారోగ్య సమస్యలను దూరం చేయడమే కాకుండా.. శరీరానికి మాంచి శక్తిని ఇస్తోందట. ఇలా ఒకరి రెండు కాక 60 కి పైగా ప్రయోజనాలు ఉన్నాయి.

వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.అరటి పువ్వు తినడం వల్ల వీర్యవృద్ధి జరిగి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందట.స్త్రీలలో గర్భాశయ సంబంధ సమస్యలను దూరం చేసే శక్తి అరటి పువ్వుకు ఉందట.గ్యాస్‌, అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి అరటి పువ్వు మేలు చేస్తుందట.అరటి పువ్వు కూరతో హైబీపీ అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె సంబంధ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.అరటిపువ్వు కూరగా చేసుకుని ఆరగిస్తే.. జీర్ణాశయంలో అలసర్ల సమస్య ఉండదట.
ఆడవారిలో పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా అరటి పువ్వు అరికడుతుంది.

డయాబెటీస్ (మధుమేహం)తో బాధపడుతున్నవారు అరటి పువ్వు కూరను తింటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయట.అరటి పువ్వుని తినడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం అవుతుంది.మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అరటిపువ్వులో ఉంటే విటమిన్-C వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు, కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా అరటి పువ్వు మంచిదట. అరటి పువ్వు మంచి రోగ నిరోధక శక్తి లాగా పని చేస్తుంది. కాబట్టి అరటి పువ్వుని ని ప్రతి రోజు తినడం అలవాటు చేసుకోండి. నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.